వికారాబాద్, ముద్ర విలేకరి : ఫోన్ ట్యాపింగ్ దోషులను కఠినంగా శిక్షించాలని, రాజ్యాంగం తనకు కల్పించిన హక్కును తనకు తెలియకుండానే కాలరాస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పిటిసిల ఫోరం మాజీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి తాను కీలక నేతగా ఉన్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తన ఫోన్ ను ట్యాపింగ్ చేయించిందని అన్నారు. తన ఫోన్ ను ట్యాపింగ్ చేయించిన విఆర్ఎస్ నాయకులపై సిట్ అధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫోన్ టాపింగ్ కేసులో మంగళవారం సిట్ అధికారులు తనను విచారించారని మహిపాల్ రెడ్డి తెలిపారు.