టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిన ఇద్దరూ నేతల బహిష్కరణ ప్రకటన విడుదల చేసిన బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, పేట మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి
ముద్ర, నారాయణపేట:
మున్సిపాలిటీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీకి చెందిన నాయకులు ఎం.డి. సలీం, జి. వీరరెడ్డి పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించినట్లు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించడం, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, క్రమశిక్షణకు భంగం కలిగించే చర్యలకు పాల్పడిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారనే అభిప్రాయం వ్యక్తమైందని పేర్కొన్నారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, పార్టీ ఆదర్శాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే, బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.