ముద్ర, మహదేవ్‌పూర్:
గుడ్ మార్నింగ్ గ్రామర్ హై స్కూల్‌కు పూర్వ విద్యార్థి శ్రీ సాయి గిరిధర్ ఇటీవల చార్టర్డ్ అకౌంటెంట్ (CA)గా అర్హత సాధించిన సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆయనను ఘనంగా సత్కరించింది.ఈ ప్రత్యేక సందర్భంలో సాయి గిరిధర్ గారితో పాటు ఆయన తండ్రి కేసర్ సింగ్ను కూడా సత్కరించి, వారికి విద్యపై ఉన్న నిబద్ధతను మరియు కృషిని ప్రశంసించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ మాట్లాడుతూ, గిరిధర్ విజయానికి ఆయన తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. పాఠశాల ఫీజులు ఎక్కువగా ఉన్నాయని కొందరు భావించినప్పటికీ, సాయి గిరిధర్ వంటి విజయగాథలు పిల్లల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్యలో పెట్టుబడి పెట్టే తల్లిదండ్రుల త్యాగం మరియు కష్టానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. కేసర్ సింగ్ ఆదర్శ తల్లిదండ్రిగా అభివర్ణించారు.
సాయి గిరిధర్ తన సందేశంలో విద్యార్థులు పెద్ద కలలు కనాలని, ఎప్పుడూ తక్కువతో సరిపెట్టుకోకూడదని సూచించారు. తనకు బోధించిన ప్రతి ఉపాధ్యాయునికి కృతజ్ఞతలు తెలుపుతూ, తన విజయానికి బలమైన పునాది వేసిన గుడ్ మార్నింగ్ గ్రామర్ హై స్కూల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.