Take a fresh look at your lifestyle.

విధేయతకే పట్టం

  • హస్తంలో పదవుల పందేరం.
  • 2017 నుంచి పార్టీలో ఉన్న వాళ్లకే పార్టీ కమిటీల్లో చోటు.
  • గుజరాత్​ మోడల్​గా పార్టీ సంస్థాగత నిర్మాణం.
  • సిద్ధాంత పోరాటాలకు రెడీగా ఉండాలి.
  • ఒక్కో మండల అధ్యక్షుడి ఎన్నికకు ఐదుగురి పేర్లు.
  • బ్లాక్​ లెవల్​లో మూడు పేర్లు.
  • ఈ నెల నుంచి జిల్లా స్థాయి సమావేశాలు.
  • పార్టీ మీటింగ్​ కు రాని పరిశీలకులపై చర్యలు.
  • వాకాటి శ్రీహరి, మరో ఐదుగురి పదవులు తొలిగింపు.
  • జిల్లాకు ఇద్దరు పరిశీలకులు.
  • ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ మీనాక్షి నటరాజన్.​
  • గాంధీభవన్లో పీసీసీ పరిశీలకుల సమావేశంలో కీలక నిర్ణయాలు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : హస్లంలో పదవుల పందేరం మొదలైంది.అధికార పార్టీలో అత్యంత కీలకమైన జిల్లా అధ్యక్షుల నియామకానికి సమయం ఆసన్నమైంది. ఎలాంటి వివాదాలు, అభ్యంతరాలు తలెత్తకుండా పకడ్బందీగా కమిటీలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్​ హైకమాండ్​ టీపీసీసీని ఆదేశించింది.ఈ కమిటీల్లో పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో టీపీసీసీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా ఆ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కార్యవర్గాల కూర్పు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది.ఈ సన్నాహాక కార్యక్రమాల్లో భాగంగా బుధవారం గాంధీ భవన్ లో రాష్ట్ర పరిశీలకుల సమావేశం నిర్వహించింది.ఈ సందర్భంగా పరిశీలకులకు మూడు దశల్లో టీపీసీసీ టాస్క్ ను నిర్దేశించింది. ఏప్రిల్ 25 నుంచి 30 తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది.మే 4 నుంచి 10 వరకు అసెంబ్లీ/బ్లాక్ లెవల్, మే 13 నుంచి 20 వరకు మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది.జిల్లా సమావేశాలకు బ్లాక్, మండల అధ్యక్షులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, ఏఐసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్లు, జిల్లా స్థాయి సీనియర్ నాయకులను ఆహ్వానించాలని సూచించింది. టాస్క్ 2 లో అసెంబ్లీ, బ్లాక్ లెవెల్ మీటింగ్స్ నిర్వహించడం, టాస్క్ 3 లో మండల మీటింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సందర్భంగా పార్టీ ప్రక్షాళనకు కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ ఛార్జీ మీనాక్షి నటరాజన్​ దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్​బంగా ఆమె కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గుజరాత్ మోడల్ గా చేపట్టాలని అధినాయకత్వం నిర్ణయించిందని చెప్పారు.అందుకోసం మళ్లీ గ్రామస్థాయి నుంచి పార్టీ సిద్ధాంత ప్రచారం, సంస్థాగత పటిష్టత జరగాల్సిన అవసరం ఉందని అబిప్రాయపడ్డారు.ఈ విషయంలో పార్టీ నాయకత్వం చాలా చిత్తశుద్ధితో అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.విస్తృత భావజాలం ఉన్న పార్టీ కాంగ్రెస్​ అన్న ఆమె.. జాతీయ పార్టీ జాతీయ స్థాయి ఆలోచనలు, సిద్ధాంతాలతో నడుస్తోందన్నారు.ప్రస్తుతం గుజరాత్ మోడల్ గా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను జనంలో విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు.సిద్ధాంత పోరాటానికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.దేశంలోనే మొదటి సరిగా తెలంగాణ లో కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ తీర్మాణాలను ఆమోదం తెలుపుకోవడం చారిత్రాత్మకమన్నారు.రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విదంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. పార్టీ నాయకత్వంలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీకి చాలా చరిత్ర ఉందన్న ఆమె బ్రిటీష్ వాళ్లతో పోరాటం చేసిన విషయాన్ని మరిచిపోవద్దని చెప్పారు.జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్. అదే స్థాయి ఆలోచనలతోనే ముందుకు పోతుందని అన్నారు. గాంధీ సిద్ధాంతాలతోనే పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు.పార్టీ సిద్ధాంత ప్రచారం, సంస్థాగత పటిష్టత గ్రామస్థాయి నుంచి జరగాలని అన్నారు.ఈ విషయంలో పార్టీ నాయకత్వం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.

  • టీపీసీసీ పూర్తి స్ధాయి ప్రక్షాళన : టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

రాష్ట్రంలో టీపీసీసీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కార్యవర్గాల కూర్పు ఉంటుందన్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ ప్రక్షాళనకు దిశా నిర్దేశం చేసినట్లు వివరించారు. పరిశీలకులకు మూడు దశలలో టాస్క్ నిర్దేశించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని డీసీసీలను ఆదేశించారు. జిల్లా సమావేశాలకు బ్లాక్, మండల అధ్యక్షులను ఆహ్వానించాలని సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, ఏఐసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్లు, జిల్లా స్థాయి సీనియర్ నాయకులు సమావేశంలో ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. టాస్క్ 2 లో అసెంబ్లీ, బ్లాక్ లెవెల్ సమావేశాలు, టాస్క్ 3 లో మండల స్ధాయి మీటింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెప్​ నిర్వహిస్తోన్న జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాలు తెలంగాణ లో విజయవంతం అవుతున్నాయని చెప్పారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను కో ఆర్డినెటర్లు సమర్ధంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేతలు సైతం.. రాష్ట్రంలో జరుగుతున్న జై బాపు, జై బీమ్ కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేసినట్లు మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు. పరిశీలకులకు ఇచ్చిన బాధ్యత అత్యంత కీలకమైందని చెప్పారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ చాలా బాధ్యత, చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.

  • త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు: వేం నరేందర్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో శ్రమించారని ప్రభుత్వ సలహాదారు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. వారి కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. దేశంలో ఒక రోల్ మాడల్ గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కుల గణన, బీసీ రిజర్వేషన్స్, ఎస్సీ వర్గీకరణ చేశాం.అనేక సంక్షేమ పథకాలు చేపట్టాము. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని దశల వారీగా పూర్తి చేస్తున్నామన్నారు. త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించబోతున్నామని చెప్పారు. వార్డు సభ్యుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, కౌన్సిలర్ నుంచి మేయర్ వరకు దాదాపు లక్షన్నర పదవులు భర్తీ చేసుకునే అవకాశం ఉందన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి మనం కృషి చేయాలని క్షేత్ర స్థాయిలో పార్టీ మరింతగా బలపడాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు.

  • లేట్​ గా వచ్చిన వారిపై వేటు.

సమావేశానికి ఆలస్యంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను వారి పదవులను తొలగిస్తూ మీనాక్షి నటరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం గాంధీభవన్ లో నియోజకవర్గాల పరిశీలకుల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన పరిశీలకులను తొలగిస్తున్నట్లు అదే వేదికపై ప్రకటించారు. వారితో పాటు సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితోపాటు మరో ఐదుగురు నేతలను పరిశీలకులుగా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.మొత్తం 70 మంది పరిశీలకులకు ఈ సమావేశానికి ఆహ్వానం అందగా..హాజరుకాని వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.పార్టీలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని సూచించారు. 2017 నుంచి పార్టీలో ఉన్న వాళ్లకే కమిటీలో చోటు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.