పొదుపు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న మోడీ.. తాను మాత్రం విదేశాలు తిరుగుతుండ్రు : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పొదుపు పేరుతో ప్రజలను బిజెపి మోడీ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు విమర్శించారు. ప్రజలను సౌకర్యాలు తగ్గించుకోమని చెప్పి విదేశాల్లో మోడీ ఎంజాయ్ చేస్తున్నాడని వారు ఎద్దేవ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సుందరయ్య భవన్, భువనగిరిలో జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వెంకట్రాములు పాల్గొని మాట్లాడుతూ 78 సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో పేదలు మరింత పేదలుగా ధనికులు మరింత ధనికులుగా పెరిగిపోతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల గ్రామీణ వ్యవసాయ కూలీలు, పేదలు పని దొరకక కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడవ మహాసభలు రామన్నపేట మండల కేంద్రంలో మే 18, 19 తేదీలలో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా మే 18న సాయంత్రం భారీ బహిరంగ సభ, 19న ప్రతినిధుల మహాసభ జరుగుతుందని ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎండి. జహంగీర్, వివిధ ప్రజా సంఘాల నాయకులకు కూడా పాల్గొంటున్నారని తెలిపారు. బహిరంగ సభలో, ప్రతినిధుల మహాసభలో వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, రాచకొండ రాములమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్, జిల్లా సహాయ కార్యదర్శులు సిరిపంగి స్వామి, గుంటూరు శ్రీనివాస్ చారి, సల్లూరి కుమార్, కూకుట్ల చుక్కాకుమారి జిల్లా కమిటీ సభ్యులు దొడ్డి బిక్షపతి, బోయ యాదయ్య, చింతకాయల నరసింహ, కొండాపురం యాదగిరి, శ్రీనివాసరావు, రాపోతు పద్మ, మానే సాలయ్య, బొల్లేపల్లి కిషన్, ఎర్ర ఊషయ్య పాల్గొన్నారు.