Take a fresh look at your lifestyle.

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

  • సైనిక గ్రూప్ జగిత్యాల ఇంఛార్జీ.

ముద్ర, రాయికల్: సైనిక గ్రూప్ ఫౌండర్స్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రోజున జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ స్టేషన్ లో SI సుధీర్ రావు చేతుల మీదుగా సైనిక గ్రూప్ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు. రాయికల్ మండల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గంజాయి, మత్తు పదార్థాల పైన బెట్టింగ్ యాప్స్ పైన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిస్తునట్లు జగిత్యాల జిల్లా ఇంచార్జ్ పంచతి బాలరాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ దొంతి నాగరాజు, పంచతి నరేష్, మహమ్మద్ అస్లాం, కొడిమ్యాల శేఖర్, తోట హరీష్, పంచతి రాజేంధ ర్, పంచతి రాజశేఖరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.