Take a fresh look at your lifestyle.

మైనర్ బాలికకు మద్యం తాగించి సామూహిక అత్యాచారం

 

ముద్ర, బండ్లగూడ:

ఓ మైనర్ బాలికకు బలవంతంగా మద్యం తాగించి ఇద్దరు మైనర్ బాలురు, ఓ యువకుడు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…. పుప్పాలగూడలో నివాసం ఉంటే 16 సంవత్సరాల ఓ మైనర్ బాలిక స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. ఈనెల 7వ తేదీన ఆమె షాపింగ్ కోసం చార్మినార్ వెళ్ళింది. అక్కడ పరిచయమైన మైనరు బాలుడితో స్నేహం పెంచుకొని ఫోన్ నెంబరు మార్చుకున్నారు. ఈనెల 16వ తేదీన ఉదయం 8 గంటలకు ఆ బాలిక పాఠశాలకు వెళ్తున్న అని చెప్పి ఇంటి నుండి వెళ్ళింది. రాత్రి అయిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు వివిధ ప్రాంతాల్లో వెతికిన ప్రయోజనం లేకపోవడంతో నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలిక చెంగిచెర్లలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించి తీసుకువచ్చారు. అయితే 16వ తేదీ తాను చార్మినార్ వెళ్లానని ఆరోజు రాత్రి తనకు పరిచయమైన మైనర్ బాలుని తోపాటు, ఇమ్రాన్ అనే యువకుడు, మరో మైనర్ బాలుడు కలిసి తనను ఆటోలో చెంగిచెర్లకు తీసుకెళ్లారని బాలిక తెలిపింది. అక్కడ కత్తితో బెదిరించి బలవంతంగా మద్యం తాగించారని అనంతరం ముగ్గురు తనపై పలుమార్లు అత్యాచారం చేశారని ఆమె పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిలో ఓ మైనర్ బాలుడిని, ఇమ్రాన్ ను జడ్జి ముందు హాజరు పరిచారు. ఇమ్రాన్ ను చంచల్గూడా జైలుకు మైనర్ బాలుడిని జువైనల్ హోమ్ కి తరలించారు. పరారీలో ఉన్న మరో మైనర్ బాలుడి కోసం వెతుకుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.