ముద్ర ప్రతినిధి, మహబూబ్ నగర్ : జడ్చర్ల పట్టణం లో ప్రభుత్వ జూనియర్ కళాశాల,ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఉదయ మెమోరియల్ హై స్కూల్ లలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ విజయేందిర బోయి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు.విద్యార్థుల హాజరు,. పరీక్షా కేంద్రాల్లో కనీస వసతులు పరిశీలించారు.ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు.పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి కాపీయింగ్ కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా,పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు.ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లు ,మొబైల్ ఫోన్ లు వంటి ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు.