Take a fresh look at your lifestyle.

17న జాబ్ మేళా

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: జల్లాలోని నిరుద్యోగ యువకులకు హైదరాబాద్ లోని సుశ్రిత ఇన్ఫ్రా ప్రాజెక్టు లో ఉద్యోగాలు కల్పించుటకు జూలై 17న గురువారం రోజున రూమ్ నెంబర్ 225 నూతన కలెక్టర్ భవన సముదాయంలో గల జిల్లా ఉపాధి కార్యాలయం లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుశ్రిత ఇన్ఫ్రా ప్రాజెక్టు హైదరాబాద్ సంస్థలో 50 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 5 మార్కెటింగ్ మేనేజర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని, పోస్టులకు 10వ తరగతి, ఇంటర్ డిగ్రీ ఎంబీఏ ఆ పై చదివి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని, వీరి వయస్సు 18-35 లోపు, ఉండాలని, ఏటి పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు జూలై 17న ఉదయం 11 గంటల సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో Room No. 225 నూతన కలెక్టర్ భవన సముదాయంలో, పెద్దకాల్వల పెద్దపల్లి మొదటి అంతస్థులో వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 8121262441, 9866019365, 8985336947 ఫోన్ నెంబర్ ల నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు ఆ ప్రకటనలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.