Take a fresh look at your lifestyle.

28వ వార్డు కౌన్సిలర్ గా గుమ్ముల సరిత మల్లేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి : మాజీ ఎమ్మెల్యే పైళ్ల

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల్లో 28వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గుమ్ముల సరిత మల్లేష్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం 28వ వార్డ్ ఇన్చార్జ్ డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని మున్సిపల్ సీటును కైవసం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ వెల్దుర్తి రఘు, వార్డు అధ్యక్షుడు నర్సిరెడ్డి, హీరేకర్ అమర్నాథ్, నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.