Take a fresh look at your lifestyle.

విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీలో నాణ్యత పాటించాలి : జిల్లా విద్యాశాఖాధికారి కందుల సత్యనారాయణ     

 

ముద్ర ప్రతినిధి, భువనగిరి : 

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందించే ఏకరూప దుస్తులను పకడ్బందీగా కుట్టాలని జిల్లా విద్యాశాఖాధికారి కందుల సత్యనారాయణ అన్నారు. ప్రతీ విద్యార్థి కొలతలు తీసుకుని ఆ కొలతల ప్రకారం దుస్తులు కుట్టాలని శిక్షణ పొందుతున్న స్వయం సహాయక సంఘం మహిళలకు సూచించారు.

బుధవారం భువనగిరి పట్టణంలో ఉన్న విదిత కుట్టు శిక్షణా కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా కేంద్రాన్ని ఆయన  సందర్శించి,శిక్షణ జరిగే తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి పెసరు లింగారెడ్డి, డిఆర్ డిఎ జిల్లా ఏ.పీ.ఎం.పసునూరి రమణ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.