ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాసంగి 2025-26 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తెలిపారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో 2025-2026, యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు నిర్వహణ కోసం రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు(ఐఏఎస్) , సంబంధిత అధికారులతో వరి కొనుగోలు సన్నాహక సమావేశంలో అధికారులకు శిక్షణ తరగతులు కలెక్టరేట్ లో నిర్వహించారు.
ధాన్యం సేకరణ వివరాలను వ్యవసాయ శాఖ ద్వారా స్వీకరించి కేంద్రాలకు వచ్చే దాన్యం పూర్తి వివరాలు డాటా ఎంట్రీ లో పొందుపరచాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ప్యాడి సెంటర్లను శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ ప్రతిరోజు చేయాలన్నారు. వరి ధాన్యం క్వింటాలకి ‘ ఏ ‘ గ్రేడ్ కు రూ.2389/-, సాధారణ రకం క్వింటాలకి 2369/- చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారిని రోజారాణి, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ హరికృష్ణ, డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, డిసిఓ మురళి, డిఏఓ రమణ రెడ్డి పాల్గొన్నారు.