Take a fresh look at your lifestyle.

పార్టీ అధ్యక్షపదవి దక్కనోళ్ళు డమ్మీలు కారు

  • కేంద్రమంత్రి బండి సంజయ్.

ముద్ర,తెలంగాణ బ్యూరో : బీజేపీ పార్టీలో ఉన్న ఎవరైనా అధ్యక్ష పదవి కోసం పోటీ పడవచ్చని, అధ్యక్ష పదవి దక్కనంత మాత్రాన్న వారంతా డమ్మీలని కాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. పార్టీలో పనిచేసే ఏ వ్యక్తి అయినా సరే అధ్యక్ష పదవి కోసం పోటీపడే హక్కు ఉంటుందన్నారు. బండి సంజయ్ లాంటి వ్యక్తి అధ్యక్షపదవి కోసం పోటీలో ఉన్న లేకపోయినా సరే కార్యకలాపాలు ఆగవని ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడారు.. బీజేపీతో సంబంధం లేని వ్యక్తులు పార్టీ అధ్యక్ష ఎన్నికలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సహించబోమని ఆయన హెచ్చరించారు.ఏపీ సీఎం చంద్రబాబు చెబితేనో, లేక మరెవరో చెబితేనో బీజేపీ అధ్యక్షుడుని నియమించరని ఆయన పేర్కొన్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకే పార్టీ అధ్యక్షుడి నియామకం ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.