Take a fresh look at your lifestyle.

మాదాపూర్ సున్నం చెరువు అక్రమాల్లో పూర్తిగా అధికారులదే భాద్యత

  • అధికారులపై చర్య తీసుకోకుండా సామాన్యులను ఇబ్బంది పెడతారా.
  • ఆగ్రహం వ్యక్తం చేసిన పీయేసీ ఛైర్మెన్ గాంధీ.

మాదాపూర్, ముద్ర విలేఖరి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ లో గల సున్నం చెరువు లో జరుగుతున్న పనులను హైడ్రా అధికారులతో కలిసి పరిశీలించి, చెరువు ఎఫ్. టి. యల్, బఫర్ జోన్ సరిహద్దులను నిర్ణయించిన తర్వాత పనులు చేపట్టాలని పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలియచేసారు.ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సున్నం చెరువు పరిధిలోని ఎఫ్. టి. యల్ బఫర్ జోన్ సరిహద్దులు నిర్ణయించి పనులు ప్రాంభించాలని హైడ్రా అధికారులను కోరుతున్నాను అని, గతంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల తప్పిదాల వలన చెరువు సరిహద్దులను మార్చడం జరిగినది అని, చెరువు పూర్తి స్థాయి లో సరిహద్దులు నిర్ణయించిన తర్వాతే పనులు చేపట్టాలని, గతంలో తప్పిదాలు చేసి, వాస్తవాలను కప్పి పుచ్చి హైడ్రా అధికారులను తప్పుదోవ పట్టించిన అధికారులను కఠినంగా శిక్షించాలని చైర్మన్ గాంధీ సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూర దృష్టితో హైడ్రా ను ఏర్పాటు చేసి చెరువులు మరియు నాలాల కబ్జాల నుండి రక్షించడానికి ఏర్పాటు చేశారు అని, కానీ హైడ్రా అధికారులను తప్పుదోవ పట్టించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు.రెవెన్యూ ,ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో సున్నం చెరువు కబ్జాకు గురి అవుతుంది అని, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గతంలో పార్లమెంట్ సభ్యుని గా, ప్రతిపక్ష నేత గా ఉన్న సమయంలో చెరువు ను సందర్శించి, చెరువు కబ్జాల నుండి కాపాడాలని కఠిన చర్యలు తీసుకోవాలని కోరగా నేటి వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అని, భూకబ్జాదారులు పెట్రేగిపోతున్నారు అని . కావున భూ కబ్జాదారుల పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నానన్నారు. చెరువు ను పరిరక్షించాలని ,చెరువులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని , కబ్జాలకు పాల్పడుతున్న ఎంతటి వారైన ఉపేక్షించే ప్రసక్తే లేదు అని చైర్మన్ గాంధీ హెచ్చరించారు.సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిదిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చి వేయాలని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ సీఈ, సైబరాబాద్ సీపీ లకు లెటర్ రాశానని చైర్మన్ గాంధీ తెలిపారు.చెరువు ఒక వైపు పూడ్చి వేసిన వారిని వదిలేసి సీఎస్ సొసైటీ లో పేద ,మధ్య తరగతి ప్రజల ప్లాట్ల ను మాత్రం ఎటువంటి నోటీసులు ఇవ్వవకుండా కూల్చివేయడం బాధాకరం , ముందు చెరువు సరిహద్దు లను నిర్ణయించి చెరువు పనులు ప్రారంభించాలని , చెరువు విస్తీర్ణం పూర్తి స్థాయిలో నిర్ణయించాలని, ఒక వైపు చెరువు కబ్జా కు గురి అవుతే మరొక వైపు కూల్చడం లో అంత్యర్యం ఏమిటో అర్థం కావట్లేదు అని గాంధీ విస్మయం వ్యక్తం చేశారు.


చెరువును గతంలో మట్టి తో పూడ్చినప్పుడు అప్పటి ఎమ్మార్వో అధికారులు అందరూ కలిసి పూడ్చిన మట్టిని జేసీబీ ల సహాయం తో తీసివేసి చెరువును పరిరక్షించామని, ఎన్నికల సమయంలో ఇదే అదునుగా భావించి కబ్జాదారుల ప్రహరి గోడలు ,చెట్లు పెంచడం ,నిర్మాణం పనులు చెప్పటి చెరువును కబ్జా చేయడం జరిగినది అని, అప్పట్లో రోడ్డు వేయడానికి ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు కానీ ఇపుడు ఏకంగా చేరువునే పూడ్చివేయడానికి అనుమతి ఎలా ఇచ్చారు అని అధికారులను ప్రశ్నించారు.చెరువులను కాపాడాల్సిన వారే బక్షిస్తే ఎట్లా అని, చెరువులు కాల్వలు,నాళాలు పూడ్చుకుంటు పోతే భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తుతుంది అని ,ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన వారిమి అవుతామని, బాధ్యతతో చెరువులను సంరక్షించాలి అని , ఇది మన అందరి బాధ్యత అని ,ఫెన్సింగ్ ఉన్న, హద్దులను తొలగించి యథేచ్ఛగా చేరువు ను మట్టి తో నింపి కబ్జాకు పాల్పడినారని చైర్మన్ గాంధీ తెలియచేసారు.ఇకనైనా అధికారులు మేల్కొని అక్రమ కట్టడాలు కూల్చివేసి పాత ఫెన్సింగ్ ప్రకారం చెరువును యథాస్థితికి తీసుకురావాలని చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించి చెరువు చుట్టూ ఫెన్సిగ్ వేసి చెరువు మళ్ళీ కబ్జాకు గురి కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చైర్మన్ గాంధీ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.