Take a fresh look at your lifestyle.

బస్తీ దవాఖానాలు విరివిగా ఏర్పాటు చేయాలి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 

ముద్ర : కాప్రా

పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానాలు విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
డా. ఏఎస్ రావు నగర్‌లో ఉన్న బస్తీ దవాఖాన భవనం విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై భవనం విస్తరణకు శంకుస్థాపన చేశారు.ఈ
ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బస్తీ దవాఖాన భవనాన్ని విస్తరించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ విస్తరణ పనులు పూర్తయిన తరువాత మరింత మంది ప్రజలకు సౌకర్యవంతమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు , బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్ సోమశేఖర్ రెడ్డి , సిపిఐ నాయకులు బోస్ డా. సత్యవతి కె ఈశ్వరయ్య డా. ఆర్ కృష్ణారావు ,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.