- మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల మునిసిపాలిటీ కి ప్రత్యేకం గా కేటాయించిన రూ 50 కోట్లు రోడ్డు విస్తరణలో నిర్మాణాలు కోల్పోయే వారికి పరిహారం చెల్లింపులు చేసే విధంగా కలెక్టర్ చరోచూపాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు లేఖ రాసినట్టు తెలిపారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాకపోయినా నా కున్న అనుభవం, జగిత్యాల అభివృద్ధి కోసంయావర్ రోడ్డు విస్తరణ లో స్థలం కోల్పోయే వారికి నిధులు జూన్ 29, 2024న ముఖ్య మంత్రికి లేఖ రాశానని, ముఖ్య మంత్రి స్పందించి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించడంతో అన్నపూర్ణ చౌరస్తా నుండి నూతన బస్టాండ్ వరకు 100 కోట్లు అవసరం అవుతాయని అధికారులు డిసెంబర్ 2024లో కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపాలిటీ ద్వారా నివేదిక సమర్పించినట్లు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాల చుట్టూ విస్తరించిన ప్రాంతల కోసం రూ 20 కోట్లు, పట్టణ పరిధిలో రూ 50 కోట్లు స్పెషల్ గ్రాంట్ గా మంజూరు చేసిందని, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు యావర్ రోడ్డు విస్తరణ ప్రధానంగా సమస్యగా భావిస్తున్న తరుణంలో ప్రణాళిక బద్దంగా, యావర్ రోడ్డు విస్తరణ కోసం రూ 50 కోట్లు వెచ్చించాలన్నారు.యావర్ రోడ్డు విస్తరణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, యావర్ రోడ్డు జాతీయ రహదారి కావడంతో రోడ్డు నిర్మాణానికి కూడా ఎంపీ సహకారం తీసుకుని నిధులు మంజూరు తీసుకోవాలన్నారు.నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని నూతనంగా రెండు వార్డులుగా ఏర్పాటు చేయాలనిలిఖిత పూర్వకంగా కాంగ్రెస్ పార్టీ తరపున మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఎలక్షన్ కమిషనర్ కు లేఖ రాశానని తెలిపారు.నూకపల్లి లో రెండు వార్డులు ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని జీవన్ రెడ్డి కోరారు.ఈ సమావేశంలో బండ శంకర్, కొత్త మోహన్, కళ్లేపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, చందా రాధ కిషన్, జితేందర్, మున్నా, మొగిలి, రఘువీర్,గుండా మధు,గిరిధర్, సాయి, జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
