- బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలని బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చే విధంగా దక్షిణాదిలో బీజేపీని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.ముఖ్యంగా తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు.ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు.మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా గొప్ప లక్ష్యంతో పార్టీని స్థాపించారన్నారు. నరేంద్ర మోదీ అదే సిద్ధాంతాలు, లక్ష్యాలకు కట్టుబడి పాలన అందిస్తున్నారని అన్నారు.ముస్లింలలోని పేద వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే వక్ఫ్ సవరణ బిల్లును మోడీ సర్కార్ తీసుకొచ్చిందన్నారు.ప్రతిపక్ష పార్టీలు కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో దేశాన్ని విభజించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. అలాంటి కుట్రలను భగ్నం చేస్తూ, మోడీ అభివృద్ధి అజెండాతో ప్రజల్లోకి వెళ్ళాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.