ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:
………………………………………..
కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని బీ ఆర్ తీసుకొని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్ నగర్ మండల పరిధిలోని రాంరెడ్డి గూడెం రైస్ మిల్లు వద్ద వరి ధాన్యం విక్రయం చేసేందుకు ఎదురు చూస్తున్న రైతులను కలిసి ఆయన మాట్లాడారు. రైతుల్లో భరోసా నింపేందుకు పాదయాత్ర నిర్వహించాలనిఅనుకున్నామని,త్వరలోనే పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.పాదయాత్ర ద్వారా ప్రతి రైతును కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం వివరిస్తామన్నారు.రైతులకు గిట్టు బాటు ధర ఇవ్వాలని..రైతులకు సకాలంలో యూరియా..కరెంటు సరఫరా చేయాలని, సకాలంలో రైతు బందు ఇవ్వాలని.. పండించిన పంటను కొనుగోలు చేయడంతో పాటు మద్దతు ధర ఇవ్వాలని.. రైతు మరణిస్తే రైతు భీమా ఇవ్వాలని.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే డిమాండ్ ల తో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం భరతం పడతామని, ప్రజలందరితో కలిసి ప్రభుత్వం పై పోరాటం చేస్తామన్నారు.
రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా పోరాటం చేస్తామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
వరంగల్ బీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో సభ పెడుతున్నట్టు ప్రకటన వచ్చిన వెంటనే కాంగ్రెస్ సర్కార్ పాత పద్దతిలో పంట కొనుగోళ్లు ప్రారంభించిందన్నారు.
ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రైతుల నుంచి మిల్లర్లు ఎక్కువ తరుగు తీస్తున్నారని, రెండు నుంచి మూడు కిలోలు తరుగు తీస్తున్నట్లు రైతులు చెబుతున్నారన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని,మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిందని ఆయన పేర్కొన్నారు.అరకొర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన కొన్ని రోజులకు ఎత్తి వేసిండ్రని, మిల్లుల వద్దకు రైతులు వచ్చినా మిల్లర్లు చాలా చోట్ల కొనుగోలు చేయడం లేదన్నారు.ప్రభుత్వం సక్రమంగా కొనకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్లాల వద్ద వడ్లు కొనుగోలు చేసామన్నారు.తడిసిన ధాన్యం కొన్నామని,సమయానికి రైతుల అకౌంట్లో డబ్బులు వేసామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి వెలగబెట్టిందని రైతు వారోత్సవాలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలు ఎదుర్కొంటున ప్రతి సమస్యమీద పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి పరిష్కారం కల్పిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.మాజీ మంత్రి వెంట గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఆంజనేయులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post