ముద్ర,ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:
……………………………………..
మహబూబ్ నగర్ పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డుపై తరచుగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ డి.జానకి సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం పోలీసు అధికారులు,నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రహదారిపై ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం, రాత్రి వేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించే విధంగా రేడియం స్టిక్కర్లు అమర్చడం, వేగ నియంత్రణ చర్యలు చేపట్టడం, డివైడర్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రమాదకర మలుపుల వద్ద ప్రత్యేక గుర్తులు ఏర్పాటు చేయడం వంటి చర్యలను వెంటనే అమలు చేయాలని అధికారులకు సూచించారు.అలాగే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణ బద్రతే ప్రధాన లక్ష్యమని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ అప్పయ్య, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
……………………………..