నూతనంగా గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పులిమామిడి రాజు
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి నియోజకవర్గంలొ నూతనంగా గెలిచిన ముదిరాజ్ సర్పంచ్,మున్సిపల్ కౌన్సిలర్లను పీ ఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ పులిమామిడి రాజు ఘనంగా సన్మానించారు.ఆనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకున్న సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులకు సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీల గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల జనాభా అత్యధిక శాతమైనప్పటికీ సామాజికంగా రాజకీయంగా ఇంకా ఎంతగానో వెనుకబడి ఉన్నారని రానున్న రోజుల్లో ఇంకా ముదిరాజ్ అభ్యర్థులు ఎంపిటిసి జడ్పిటిసిలుగా,కార్పొరేటర్ లుగా ఎదగడానికి మనమంతా కృషి చేయాలని అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ముదిరాజులను బిసి-డి నుంచి బీసీఏకి మార్చుతామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చే దిశగా మనమంతా పార్టీలకతీతంగా ఉమ్మడిగా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.