- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.కల్వకుర్తి మండలం వేపూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షణ, గాంధీ శాంతి సందేశం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామంలో ని ప్రతి గడప గడపకు వెళ్ళి కరపత్రాలు పంచుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఏ విధంగా అణిచి వేస్తుందో వివరించారు. గత కొన్ని సంవత్సరాలు జరగని బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ బిల్లు ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికె దక్కిందన్నారు.కార్యక్రమంలో కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితీ విజయ్ కుమార్ రెడ్డి, గ్రామ నాయకులు శ్యామ్ సుందర్ రావు, మల్లేష్, శ్రీధర్, మాజీ సర్పంచ్ లు లింగమయ్య, రాకేష్,రాములు, పాండు రంగా రెడ్డి, యువజన కాంగ్రెస్ కల్వకుర్తి మండల అధ్యక్షులు బీస బాల్ రాజు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ,నాయకులు ఎముక రవి, యుగంధర్,పడకంటి వెంకటేష్, సురేష్, గణేష్, చంద్రకాంత్ పాల్గొన్నారు.