Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి… జగిత్యాల జిల్లా సత్యప్రసాద్

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జగిత్యాల జిల్లా సత్యప్రసాద్ అన్నారు. మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి, చిన్నారుల ఎత్తు, బరువు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

వారికి అందిస్తున్న పోషకాహారం, భోజన నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, సమతుల ఆహారం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.