ట్యాంక్ బండ్ పై ధర్మ బిక్షం గారి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి : గీతా పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి బోలగాని సత్యనారాయణ
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
పేద బడుగు బలహీన వర్గాల పోరాట యోధుడు గీత కార్మికుల జన బాంధవుడు బొమ్మగాని ధర్మం బిక్షం సేవలు చిరస్మరణీయమని, అయన విగ్రహాన్ని ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై పెట్టి ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని గీతా పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి బిలగాని సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం భువనగిరి పట్టణంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ధర్మం బిక్షం 15వ వర్ధంతి సందర్బంగా అయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి ఇమ్రాన్, జిల్లా కమిటీ సభ్యులు గాదెగాని మాణిక్యం, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, సిపిఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, నాయకులు సామల భాస్కర్, బద్దం వెంకట్ రెడ్డి, పిన్నం జగన్, ఎండి బాబా, మామిండ్ల సత్యనారాయణ పాల్గొన్నారు.