Take a fresh look at your lifestyle.

యోగాసనాలు పరిపూర్ణ ఆరోగ్యాన్నిస్తాయి

  • సింగరేణి “సేవా” అధ్యక్షురాలు బి.వనజా వెంకటయ్య.

యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: పోతన కాలనీలోని పతాంజలి యోగ మందిరంను బుధవారం సింగరేణి రామగుండం రెండవ ఏరియా జనరల్ మేనేజర్ బి. వెంకటయ్య దంపతులు పునః ప్రారంభించారు. పోతన కాలనీ మహిళల సౌలభ్యం మేరకు, స్థానిక సేవా సమితి సభ్యులు ఉదయం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి, ముఖ్య అతిథులుగా హాజరైన ఏరియా జనరల్ మేనేజర్ బి.వెంకటయ్య, ఆయన సతీమణి, ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు బి.వనజ, నూతనంగా ఆధునికరించిన పతాంజలి యోగా మందిరంను లాంచన ప్రాయంగా పునః ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ..ఉద్యోగుల, వారి కుటుంబ సభ్యుల శారీరక, మానసిక ఆరోగ్య అభివృద్ధికి యోగాసనాలు ఎంతగానో దోహద పడతాయన్నారు. ఆధునీకరించిన యోగ మందిరం, యోగాసనాల సాధన చేయడం వల్ల, స్థానిక ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనశైలిని సాగించేందుకు మార్గాన్ని చూపుతుదన్నారు.పెద్దలు, పిల్లలు, మహిళలు అందరూ యోగా సాధనలో భాగస్వాములై, ఈ మందిరాన్ని సంపూర్ణంగా వినియోగించుకుని పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఇంకా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏరియా ఏఐటీయూసీ నాయకుడు శ్యామ్సన్, డిజిఎం సివిల్ ధనుంజయ, డివైఎస్ఇ వినయ్ సాగర్, ఇఇ సివిల్ ప్రతాపగిరి రాజు, ఏరియా సెక్యూరిటి అధికారి షరీఫ్ మహమ్మద్, స్థానిక మహిళలు సేవా సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.