Take a fresh look at your lifestyle.

గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపులోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తల* గజ్వెల్ లో ఉద్రిక్తత * భారీగా మొహరించిన పోలీసులు

 

ముద్ర ప్రతినిధి (గజ్వెల్ )సిద్దిపేట :

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను తీసుకొని గజ్వెల్ క్యాంప్ కార్యలయంలోకి దూసుకెళ్లారు. ముఖ్యమంత్రి ఫొటోను పెట్టి ‘జై కాంగ్రెస్’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో క్యాంప్ కార్యాలయంపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఫర్నీచర్, కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి..కాంగ్రెస్ కార్యకర్తలే దాడి చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. క్యాంప్ కార్యాలయంలో కేవలం సీఎం ఫొటోను మాత్రమే పెట్టామని దాడి చేయలేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఎలాంటి సంఘాటనలు జరుగకుండా అక్కడ పోలీసులను భారీగా మోహరించారు.

ప్రజాస్వామ్యంపై దాడి: హరీశ్ రావు

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఖండించారు. ఇది ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ గూండాలు చేసిన దాడి అని ఆరోపించారు. ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయంపైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్ల లేనట్లా? అని ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.