Take a fresh look at your lifestyle.

ఈవీఎం గోదాం పరిశీలించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

 
ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లాలో నిర్వహిస్తున్న నెలవారీ తనిఖీలలో భాగంగా కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను శనివారం పరిశీలించారు. గోదాంలో భద్రపరచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అగ్ని ప్రమాద నివారణ చర్యలు, డబుల్ లాక్ సిస్టమ్ వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించారు. గోదాం వద్ద నియమించిన భద్రతా సిబ్బంది విధుల నిర్వహణపై కూడా సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడటానికి ఈవీఎంల భద్రత అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు.
గోదాంలో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.