Take a fresh look at your lifestyle.

నైతిక విలువలు అలవర్చుకోవాలి

విద్యార్థులకు మాజీ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి సూచన

శివ సాయి ఇంటర్నేషనల్ స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సబితారెడ్డి
(ముద్ర ప్రతినిధి – ఉమ్మడి రంగారెడ్డి జిల్లా): చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మున్సిపాలిటీలోని చిలుకూరులో ఉన్న శ్రీ శివ సాయి ఇంటర్నేషనల్ స్కూల్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యా సంస్థ నిర్వాహకులను అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
****

Leave A Reply

Your email address will not be published.