Take a fresh look at your lifestyle.

కేశపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకటరమణ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు పిఓ డిటిటి డాక్టర్ ఉమాశ్రీ గారితో కలిసి కేశపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు.

ఈ సందర్శనలో హాజరు రిజిస్టర్,అవుట్ పేషెంట్ రిజిస్టరు,ఎన్ సి డి రిజిస్టర్, ఫార్మసీ స్టోర్స్ ,పిల్లల వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే ఐఎల్ఆర్ ను దాని రోజువారి టెంపరేచర్ రికార్డుల నమోదును పరిశీలించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవుట్ పేషంట్లను పలకరిస్తూ వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
స్టాఫ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ పీహెచ్సీ డెలివరీ లను ఇంప్రూవ్ చేయాలన్నారు, గర్భవతుల చెకప్స్ ,అభా కార్డుల క్రియేషన్ సంఖ్యను పెంచాలన్నారు 13 సం,,ల వయస్సు పైబడిన వారందరికీ ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపులలో స్క్రీనింగ్ చేసిన అందరిని రీస్క్రీనింగ్ చేస్తూ ఫాలోఅప్ చేయాలన్నారు.
ప్రసూతి గది పరిశుభ్రతలను పరిశీలించి అందులో ఉండాల్సిన ప్రోటోకాల్ చార్టులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కేశపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శ్రావణి,డాక్టర్ సంధ్యారాణి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాస్కర్ మరియు సంబంధిత వైద్య సిబ్బంది ఉన్నారు.

Sd/-
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
కరీంనగర్
దీని ప్రతి అందరూ పత్రికా ప్రతినిధులకు ప్రచురణ నిమిత్తము శ్రీయుత జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా పంపనైనది.

Leave A Reply

Your email address will not be published.