Take a fresh look at your lifestyle.

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

  • ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటుచేసిన మహాలక్ష్మి పథకం విజయవంతమైన సందర్భంగా ఏర్పాటుచేసిన సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ తప్పకుండా అమలు చేస్తూ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం జరిగిందని ఇప్పటివరకు రెండు వందల కోట్ల మంది ప్రయాణం చేయడం శుభ సూచకమని అన్నారు. ఉచిత ప్రయాణంతో అనేకమంది మహిళా ఉద్యోగులకు, ఇతర ప్రాంతాలకు ఉపాధికి వెళ్లే మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఉచిత ప్రయాణంతో మహిళలతో పాటు ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందని ఇందుకు సహకరిస్తున్న ఆర్టీసీ కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. డిపోలకు కొత్త బస్సులు కేటాయించడంతోపాటు మహిళా సంఘాల నిర్వాహకులకు బస్సులను నిర్వహించే బాధ్యతను అప్పగించి వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని అన్నారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం సుభాషిని, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.