Take a fresh look at your lifestyle.

వాసాలమర్రి జడ్‌పిహెచ్‌ఎస్‌లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, స్టేషనరీ పంపిణీ

ముద్ర, తుర్కపల్లి:
తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సందర్భంగా అవసరమైన ఎగ్జామ్ ప్యాడ్లు మరియు స్టేషనరీని BRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కనక నాగరాజు గారు అందజేశారు.
పదవ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో రాయాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి తమ పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం బాలమణి, ఉపాధ్యాయులు మరియు పలుగుల శిరీష, దుడుక కరుణాకర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.