Take a fresh look at your lifestyle.

కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్‌కు పనులు ముమ్మరం – రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…

 

పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విప్….

కోరుట్ల, ముద్ర;
కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్‌కు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయనీ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇరిగేషన్ అధికారులతో కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు పరిశీలించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల వేగాన్ని పెంచాలని అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని దిశానిర్దేశం చేశారు.

వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల రైతులకు సాగు, త్రాగునీటి అవసరాలను తీర్చే కీలక ప్రాజెక్ట్ అయిన కలికోట సూరమ్మ చెరువు అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 43 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాంతీయ రైతులకు భారీగా లాభం చేకూరనుంది. ఇప్పటికే ప్రాజెక్ట్‌కు సంబంధించిన కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తయిందని, త్వరలోనే కాలువల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. విప్ వెంట మండలాధ్యక్షులు కాయితీ నాగరాజు, మార్కెట్ చైర్మన్ పుండ్ర నారాయణ రెడ్డి, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.