Take a fresh look at your lifestyle.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తిరుప్పావడ సేవ

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి గురువారం తిరుప్పావడ సేవ నిర్వహించారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారని అర్చక స్వాములు తెలిపారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుందని అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ, తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు. వేదమంత్రోచ్ఛారణలతో అర్చించి కర్పూరమంగళ హారతులు సమర్పించారు.

Leave A Reply

Your email address will not be published.