ముద్ర ప్రతినిధి, మెదక్:
మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కానుగు రాధికా భూపతి రాజు మాట్లాడుతూ…40 సంవత్సరాల చిన్న వయసులోనే భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ఆధునిక భారతదేశ వైపు నడిపించిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్,
పట్టణ పార్టీ అధ్యక్షులు మందుగుల గంగాధర్,,నాయకులు కానుగు భూపతి రాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, సయ్యద్ ఉమర్, బుడ్డ రాజు, పిల్లి కొట్టాల నాగరాజు, దేవుల నాయక్, బాలరాజు యాదవ్, ఎండి ముజామిల్, కార్యకర్తలు పాల్గొన్నారు.
పట్టణ అధ్యక్షునికి సన్మానం
మెదక్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మందుగుల గంగాధర్ నియమించినందున మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా రాష్ట్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ శాసనసభ్యులు రోహిత్ నాయకత్వంలో మెదక్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, భూపతి రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post