అభిమానులను పేట ప్రజలను పలకరిస్తూ పార్కులో వాకింగ్
ముద్ర, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి గురువారం మార్నింగ్ వాక్ చేశారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు, సైన్స్ పార్క్ లో కొంత సేపు వాకింగ్ చేస్తూ పార్కులో ఆరోగ్యం కోసం వచ్చిన వయో వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ తో సరదాగా మాట్లాడారు. పార్క్ మెయింటెనెన్స్ కూడా చేయడం లేదని… ఎండాకాలం వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు.

మున్సిపల్ అధికారులకు స్పందించి పార్కు మెయింటైనెన్స్ పై దృష్టి పెట్టాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచి గెలిపించాలన్నారు. జిల్లా కేంద్రంలో నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఒక్కసారి ప్రజలు గుర్తుచేసుకొని ఆలోచించి ఓటు వేయాలని కోరారు.