Take a fresh look at your lifestyle.

విద్య హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి

  • సిపిఎం జగిత్యాల జిల్లా కమిటీ సభ్యుడు జి. తిరుపతి నాయక్.

కోరుట్ల, ముద్ర విలేకరి: విద్య హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేసే అంశమై ఉన్నంత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సిపిఎం జగిత్యాల జిల్లా కమిటీ సభ్యుడు జి. తిరుపతి నాయక్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేటు స్కూల్ల లో 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో జగిత్యాల జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జి .తిరుపతి నాయక్ మండి పడ్డారు. చట్ట ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న పేద పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్లో 25% సీట్లు ఉచితంగా కేటాయించాల్సి ఉందన్నారు. కానీ ఈ విషయాన్ని యజమానులు పట్టించుకోవడం లేదన్నారు.

విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారని, ఫీజులు విపరీతంగా పెంచి విద్యార్థుల తల్లి తండ్రుల పై మోయలేని భారం వేస్తున్నారని అన్నారు. జిల్లా విద్యాధికారి తక్షణమే స్పందించాలన్నారు. ప్రైవేట్ పాఠశాల యజమానులతో మాట్లాడి ఉచితంగా 25% సీట్లను పేద విద్యార్థులకు ఇప్పించేలా చూడాలన్నారు. పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, ఇలా అన్నిటిని పాఠశాలల్లోనే అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు తల్లి తండ్రుల మీద భారం పడకుండా తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి యెల్ల పోశయ్య , కుంచం శంకర్, అశోక్, లింగంపల్లి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.