- కోరుట్ల ఐసీడీఎస్ సూపర్ వైజర్ అలవాల భారతి.
కోరుట్ల, ముద్ర విలేకరి: రెండున్నరేళ్ళ నుండి 5 ఏళ్ల పిల్లలు అంగన్ వాడి స్కూల్ కు పంపించాలని కోరుట్ల ఐసీడీఎస్ సూపర్ వైజర్ అలవాల భారతి అన్నారు. అమ్మ మాట – అంగన్ వాడి బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజు కోరుట్ల పట్టణంలోని బాలాజీ రోడ్ అంగన్ వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ విద్య ప్రాముఖ్యత గురించి ఆమె వివరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంగన్ వాడిలో అందించే ఆటపాటలతో కూడిన విద్య ప్రాముఖ్యత, వారి పోషకస్థితిని అంచనా వేయడం, రోజు వారిగా టైమ్ ప్రకారం, విద్యాబోధన చేస్తున్నామని పేర్కొన్నారు. మంచి అలవాట్లు సృజనాత్మకత, బాషా అభివృద్ధి, బ్లాక్స్ ఫజిల్స్, నాటకీకరణ వంటి కార్నర్స్ ద్వారా వారిలో ఉన్న మేధాభివృద్ధికి కృషి చేస్తూ విద్య భోధన అందిస్తున్నామని అన్నారు. అంగన్ వాడిలో చేరిన పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించడం జరిగిందని సూపర్ వైజర్ అలవాల భారతి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ ఇమ్రాన, తల్లులు, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.