Take a fresh look at your lifestyle.

నిలిచిన నీటితో ప్రజల ఇబ్బందులు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : వార్డు ప్రజల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నిర్మాణం చేసిన సీసీ రహదారిపై నిలిచిన నీటితో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. స్థానిక ఎనిమిదో వార్డు సమీపంలోని ఓ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు నిత్యం తమ క్యాన్లలో నీరు నింపుతున్న క్రమంలో వచ్చే నీటితో రహదారి పక్కన పెద్ద మడుగు ఏర్పడి అందులో నీరు నిలుస్తున్నాయి. మున్సిపల్ అధికారులు ప్లాంట్ నిర్వాహకులకు ఎన్ని సార్లు చెప్పిన తమ పద్ధతి మార్చుకోవడం లేదని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సానిటేషన్ విభాగానికి చెందిన అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.