Take a fresh look at your lifestyle.

ప్రజా పాలన ప్రజా ప్రణాళిక కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ హైమావతి

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్27వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు – బాలల భద్రత, రక్షణ, మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం పటిష్టంగా నిర్వహించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, పోలీస్ , వివిధ జిల్లా శాఖ అధికారులతో కలిసి దత్తత సహాయ కేంద్రం (అడాప్షన్ హెల్ప్ డెస్క్) ఊయల కార్యక్రమము ప్రారంభించారు. ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు – బాలల భద్రత,రక్షణ మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం నిర్వహణకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్డీవోలు, ఎంపీడీవోలు, పోలీస్ , మండల ప్రత్యేక అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు.
ఈ సంక్షేమ వారోత్సవాలలో భాగంగా సోమవారం దత్తత సహాయ కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్బంగా మానసిక వైద్యులు శాంతి పలు సూచనలు చేశారు.కలెక్టరేట్ హాఫ్ డే ఆఫ్టర్ కేర్ క్యాంప్ నిర్వహణ కార్యక్రమంలో శిశు సంరక్షణ సంస్థలలో, పిల్లలకు వ్యక్తిగత అనంతర సంరక్షణ ప్రణాళిక (ఇండివిజువల్ ఆఫ్టర్ కేర్ ప్లాన్ IAP) , గృహ, విద్యా, నైపుణ్యాల, జీవన ఉపాధి, ఆరోగ్యం మార్గదర్శకత్వానికి అనుసంధానం చేయడంపై, శిశు సంరక్షణ సంస్థలలో నివాస ఉండి 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు మానసిక ఆరోగ్యం, అక్రమ రవాణా, దుర్బలత్వం నిరాశ్రయత పదార్థ వినియోగం అవసరమైన సూచనలను అవగాహన కార్యక్రమంలో సూచించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారి శారద, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ మమత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాము, డాక్టర్ శాంతి మానసిక వైద్య నిపుణురాలు GGH సిద్దిపేట, వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.