ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ మంజుల రమాదేవి, పాఠశాల డైరెక్టర్లు బియ్యల హరి చరణ్ రావు, జగిత్యాల జిల్లా ట్రస్మా అధ్యక్షుడు బోయినపల్లి శ్రీధర్ రావులు జగ్జీవన్ రావు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు విద్యతోపాటు సామాజిక అంశాలపై అవగాహన ఉండాలని, విద్యార్ధి దశ నుంచి లోనే కస్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.యువత వివిధ బాధ్యతగా వ్యవహరిస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని అన్నారు. ప్రతి విద్యార్థి తాను అనుకున్న ఆశయాలు సాధించి ఆదర్శంగా ఉండాలని సెల్ఫోన్లకు, ఇతర వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలని అని అన్నారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో నూతన టెక్నాలజీ పరంగా విషయాలను తెలుసుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మౌనిక రావు, రజిత, అజిత, సుమన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
