ముద్ర, కుషాయిగూడ:
పేద ప్రజల కు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చెర్లపల్లి బస్ స్టాప్ లో సీనియర్ రాజకీయ నాయకుడు కడియాల పోచయ్య జ్ఞాపకార్థం అపోలో వైద్యశాల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని ప్రారంభించారు.మల్కాజిగిరి అదనపు పోలీస్ కమిషనర్ వెంకటరమణ, చర్లపల్లి ఐల చైర్మన్ గోవింద్ రెడ్డి, మాజీ చైర్మన్లు కట్టంగూరు హరీష్ రెడ్డి, రోషి రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పావని మణిపాల్ రెడ్డి, సింగి రెడ్డి ధన్ పాల్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నియోజకవర్గ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు బస్తీ దావఖానాలు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. గతంలో చర్ల పల్లి అభివృద్ధి కోసం కడియాల పోచయ్య చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరంలో హాజరైన 500 మందికి పైగా వైద్యులకు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, తాటి శ్రీనివాస్, నాయకులు గిరిబాబు, బూడిద శ్రావణ్ కుమార్, డప్పు యాదయ్య, నాగిళ్ల బాల్రెడ్డి,బాబు, భరత రాజ్, అనిల్ కుమార్, గడ్డం యాదగిరి, రెడ్డి నాయక్, శ్రావణ్ కుమార్, లోకనాథ్, విజయ్ రాజ్, గణేష్, ధీరజ్ బాలాజీ, అఖిల్, శివంలతో పాటు అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.