ముద్ర విలేఖరి, అచ్చంపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి రెవెన్యూ సదస్సు ను అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మాన్ననుర్ గ్రామంలో నిర్వహించారు.ఈ భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమం లో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి ద్వారా రైతుల యొక్క భూ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. భూభారతి కార్యక్రమంలో రెవెన్యూ సదస్సు నియోజకవర్గం మొత్తం కూడా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కొరకు నిర్వహించారన్నారు.ఈ సదస్సు ద్వారా రైతులు, ప్రజలు, భూ సమస్యలు ఏమైనా ఉంటే సదస్సులో రెవెన్యూ శాఖ అధికారులకు కలిసి భూ బాధితులు ఫిర్యాదు చేసుకోవచ్చని వంశీకృష్ణ గ్రామస్తులకు రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
