Take a fresh look at your lifestyle.

మానసిక స్థైర్యంతో లక్ష్యాన్ని సాధించాలి దివ్యాంగులకు కలెక్టర్ మనోదైర్యం

ముద్ర,మేడ్చల్ జిల్లా ప్రతినిధి :

దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ట్రైసైకిళ్లు, వీల్ సైకిళ్లను సరైన విధంగా వినియోగించుకొని జీవితంలో ఆర్థికంగా ఎదగాలని,అందుకు మీకు అవసరమైన మార్గనిర్దేశాలను,సహాయ సహాకారాలనుఅందించేందుకు ప్రభుత్వం ఎళ్లవేళల ముందుంటుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు.
సోమవారం అల్వాల్ లోని సఖీ సెంటర్ లో జిల్లా మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు 56, వీల్ సైకిళ్లు 14 పంపిణీ చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మను చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్, ఆర్డిఓ ఓం ప్రకాష్, అల్వాల్ తహాసీల్దారు రాములు, డిడబ్లూఓ శారద తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు శారీరకంగా ఇబ్బందులు ఉన్నప్పటికి మానసికంగా ధైర్యంగా ఉంటూ తమ లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్లాలని,అందుకు అవసరమైన సహాయ సహాకారాన్ని తప్పకుండా అందిస్తామని కలెక్టర్ తెలిపారు. మానసికంగా దైర్యంగా ఉంటే అవకలనం అడ్డంకి కాదని, అన్నిరంగాలలో మీరు రాణించాలని కలెక్టర్ కోరుకున్నారు. ఈ రోజు ఒక పరిస్థితిలో ఉన్నాము, రేపటికి దీనికంటే మెరుగుగా ఉండాలనే ఆలోచనలు మీలో ఉంటే మీ ఆలోచనలకు కార్యరూపం అందించేందుకు ఎళ్లవేళల మేము మీ వెంట ఉంటామని కలెక్టర్ అన్నారు. మీరు ఆర్థికంగా ఎదగడానికి అనేక ఆలోచనలు ఉంటాయి, సొంతంగా బిజినెస్, సొంతంగా స్టార్టప్, ఒక దుకాణం పెట్టుకోవడానికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహాకారం అందిస్తామన్నారు. అంతేకాకుండా మీ పిల్లలు ఎక్కడైనా చదువుతూ కెరీర్ కౌన్సెలింగ్,ఇతర కోర్సులు నేర్చుకోవడానికి స్కిల్ డెవలప్ మెంట్ వంటి వాటిని ఇంప్రూవ్ చేసి వివిధ రంగాలలో రాణించడానికి కావలసిన సామర్థ్యాన్ని పెంపొందించడానికి తప్పకుండా వారికి సహాకారం అందిస్తూ తోడ్పడతామని కలెక్టర్ అన్నారు. మీ పిల్లలను చదివించడంలో వారికి కెరీర్ నిర్మాణంలో కూడా మీకు కావలసిన కౌన్సిలింగ్ కు మార్గనిర్దేశాన్ని అందించడమే కాకుండా ప్రభుత్వ మార్గనిర్దేశాల మేరకు ఆర్థిక సహాయం కూడా అందిస్తామన్నారు. ఈసారి వీల్ ఛైర్లు, ట్రై సైకిళ్లు అందని వారికి తప్పకుండా తదుపరి అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి కలెక్టర్ దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ ఛైర్లు పంపిణీ చేసారు. కలెక్టర్ సఖి సెంటర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.