Take a fresh look at your lifestyle.

చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలి – ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 

ముద్ర : కాప్రా

కల్యాణ లక్ష్మి ,షాది ముభారక్ చెక్కులు పంపిణీ పారదర్శకంగా జరగాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా లక్ష నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు.
ఉప్పల్ మునిసిపల్ కార్యాలయంలో 172 మందికి కల్యాణ లక్ష్మి ,షాది ముభారక్ చెక్కులను లబ్ధదారులకు చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలందరూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అధికారులు ,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.