- అవగాహన సదస్సుల్లో కలెక్టర్.
ముద్ర, మల్యాల: భూ భారతి పోర్టల్ తో రైతుల భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. మండలంలోని ముత్యంపేట రెడ్డి ఫంక్షన్ హాల్ లో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ,పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి భూ యాజమాన్య హక్కులు కాపాడేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని అన్నారు.అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, భూ భారతి చట్టంలో పొందుపరిచిన అంశాలు, హక్కుల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.రికార్డుల్లో చిన్న తప్పులున్నా సవరించేందుకు అవకాశం కల్పించామన్నారు.అప్పీలు వ్యవస్థతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, ఎమ్మార్వో మునిందర్, ఆర్ఐ తిరుపతి, ఎంపీడివో స్వాతి, ఎంపీవో ప్రవీణ్, ఏవో చంద్ర దీపక్, సీనియర్ నాయకులు దారం ఆదిరెడ్డి, బత్తిని శ్రీనివాస్, వెల్మ లక్ష్మారెడ్డి, ముత్యం శంకర్, మ్యాక లక్ష్మణ్, శనిగారపు తిరుపతి, కొండబత్తిని అనిల్, కటుకం వినయ్, నేరెళ్ల సతీష్ రెడ్డి, బివి రమణ పటేల్, బాలే శ్రీనివాస్, సంత ప్రకాష్ రెడ్డి, నక్క అనిల్, ముద్దం శ్రీనివాస్, తాళ్ల హరినాథ్, ఎండి ఇమామ్, కోరేపు వెంకటేష్, కనకట్ల జలంధర్ తదితరులు పాల్గొన్నారు.
