మహబూబాబాద్ ,ముద్ర ప్రతినిధి: ఇంటర్మీడియట్ ఫలితాలలో మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న మదాసు తిరుపతి కూతురు అనుశ్రీ ఎంపీసీ మొదటి సంవత్సరం లో 468 మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అనుశ్రీ ని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, ఆర్ఐలు భాస్కర్, సోములు, హోంగార్డ్ యూనియన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.