Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ జెండాకు యువత గుండెకాయ వంటిది

  • యువతకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటా.
  • తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండల పరిధిలోని కొర్విచెడ్ ఫంక్షన్ హాలులో శుక్ర వారం ఏర్పాటు చేసిన “యువతతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో ముఖాముఖీ” కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పలు గ్రామాల యువ నాయకులు అడిగిన పలు ప్రశ్నలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమాధానాలు ఇచ్చారు. మీకు ఒక అన్నగా, కుటుంబ సభ్యునిగా అండగా ఉంటా. నాకు యువత, కార్యకర్తల గురించి బాగా తెలుసు.నేను 30 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్న, కార్యకర్త నుండి జడ్పీటీసీ గా, డీసీసీబీ చైర్మన్ గా, ఎమ్మెల్యే అయ్యాను.యువత అంటే మీటింగ్ ఉన్నప్పుడు జండాలు పట్టే విధంగా గత పాలకులు ఇక్కడున్న యువతను తయారుచేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంతోమంది యువతకి అవకాశాలు కల్పించాలని అడుగులు వేయడం జరుగుతుందన్నారు.ఎమ్మెల్యే గా కాకుండా మీ ఇంటివాడిగా, మీ అభివృద్ధి, మంచి కోరుకునే వ్యక్తిగా నేను పని చేస్తాను అని అన్నారు.మీ లక్ష్యమేంటో నిర్ణయించుకోవాలి, నీవు ఆర్థికంగా ఎదిగినప్పుడే మీ కుటుంబం బాగుపడుతుంది.ఇప్పుడున్న యువత చాలామంది డ్రగ్స్, గుట్కా, మద్యపానం, గంజాయి లకు బానిసగా మారడం బాధాకరం.మీపైన ఆధారపడి మీ కుటుంబం ఉందని గ్రహించి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు.కాలానుగుణంగా అందరికి అవకాశాలు కల్పిస్తాను అని అన్నారు.నమ్మకంగా ఉండండి, నమ్మకంగా పని చేయండి మీ అందరికీ నేను అండగా ఉంటా అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ, ప్రస్తుత మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, యువ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.