Take a fresh look at your lifestyle.

మెదక్ ఆసుపత్రిలో ఏసీబీ తనిఖీలు

 
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి పరిపాలన విభాగంలో ఏసీబీ ఉమ్మడి జిల్లా డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు చేశారు.
మెడికల్ బిల్లులకు సంబంధించిన సెక్షన్ లో వివిధ రకాల ఫైళ్లను పరిశీలించారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల విషయంలో సూపర్డెంట్ లతీఫుద్దీన్ ముజాయిద్ధిన్
ఔట్ వార్డ్, మూమెంట్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించడం లేదని తెలిపారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ సమయానికి పంపడం లేదని, తృణమో, ఫలమో అందితే తప్ప ఆ బిల్లు పాస్ చేయడం లేదనే ఆరోపణలున్నాయన్నారు. తన సెక్షన్లో 282 బిల్లులు ఉండగా 116 బిల్లులు సంబంధిత శాఖలకు పంపకుండా సూపరింటెండెంట్ తమ వద్దే ఉంచుకున్నారని పేర్కొన్నారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. తనిఖీలో ఇన్స్పెక్టర్లు రమేష్, వెంకటేష్, సిబ్బంది ఉన్నారు.మెదక్ ఆసుపత్రిలో ఏసీబీ తనిఖీలు

Leave A Reply

Your email address will not be published.