Take a fresh look at your lifestyle.

ఘనంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

వికారాబాద్,ముద్ర ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో సోమవారం ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భవ దినోత్సవం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ 60వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి వికారాబాద్ జిల్లా ఇన్చార్జి గట్టు గల్లా ప్రశాంత్ మాదిగ, సీనియర్ నాయకులు పెద్దోళ్ళ ఆనంద్ కుమార్ మాదిగ, జిల్లా అధ్యక్షులు కోడిగంటి మల్లికార్జున మాదిగ, ఎం ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు పీ .నరసింహులు మాదిగలు పాల్గొన్నారు. గట్టు గల్లా ప్రశాంత్ మాదిగ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఎన్నో పోరాటాలు చేసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండబడే అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకొని ముఖ్యంగా ఈ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అండదండలతో సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా వర్గీకరణ కోసం పోరాడుతూనే ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజలకు కూడా అండగా నిలబడి అనేక పోరాటాలు చేసి ఆరోగ్యశ్రీ కార్డు కానివ్వండి, వృద్ధులు, వితంతువుల పింఛన్, వికలాంగుల పెన్షన్ల కోసం ఆకలి కేకల పోరాటాలు చేసి ఎన్నో సంక్షేమ పథకాలు సాధించి పెట్టినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో తాండూర్ మండల ఇంచార్జ్ జగదీష్ మాదిగ, పెద్దముల్ మండల అధ్యక్షులు ఉమా శంకర్ మాదిగ వై బాల్రాజ్ మాదిగ, శ్రీనివాస్ మాదిగ, దశరథ్ మాదిగ మాణిక్యం మాదిగ, నరేష్, బద్రి, లాలప్ప మాదిగ, శ్రీనివాస్ మాదిగ, భారత్ మాదిగ, అశోక్ మాదిగ, వెంకటేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.