Take a fresh look at your lifestyle.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని సిపిఎం నిరసన

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఉపసంహరించుకుని జీఎస్టీ పరిధిలోకి తేవాలని సిపిఐ ఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు. శనివారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రైతు బజార్ వద్ద కేంద్ర ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం చేశారు. యుద్ధం పేరుతో నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో మరింత భారమవుతుందన్నారు. వెంటనే ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిపిఐఎం కార్యవర్గ సభ్యులు బందల ఎల్లయ్య, వనం రాజు, కమిటీ సభ్యులు వల్లాస్ అంజయ్య, చింతల శివ, ఈర్ల రాహుల్, జూకంటి పావుల్, జగ్గులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.