Take a fresh look at your lifestyle.

మామిడి మార్కెట్ లో రైతులకు న్యాయం చేయాలి

  • మాజీ మంత్రి టీ . జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల మామిడి మార్కెట్ లో నిబంధనలు అమలు కాకపోవడంతో రైతులు చాలా నష్టపోతున్నారని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ కు జీవన్ రెడ్డి లేఖ రాశారు. జగిత్యాల ప్రాంతంలో తేనె మంచు కారణంగా మంగు ఏర్పడి మామిడి రైతులు నష్టపోతున్నారని, దానికి తోడు తీసుకొచ్చిన కాయలను సక్రమంగా కొనుగోలుచేయక మార్కెట్లో రైతులు చాలా నష్టపోతున్నారని అన్నారు. మార్కెట్ నిమధులకు అనుగుణంగా మార్కెట్ కు వచ్చిన మామిడి పంట మొత్తాన్ని రైతులకు అనుగుణంగా వేలం పాట నిర్వహించాల్సి ఉన్నప్పటికీ వేలం నిర్వహించడక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. మార్కెట్ రుసుం కూడా నిబంధనలకు అనుగుణంగా 4 శాతానికి పరిమితం కాగా,ప్రస్తుతం 10 శాతం మార్కెట్ ఫీజు తీసుకోవడంతోపాటు వేయింగ్,క్వాంటిటీ తెలిపే తక్ పట్టి జారీ చేయకపోవడంతో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.మార్కెట్లో వేలంపాట నిర్వహణతో పాటు సూటు 5 శాతం మాత్రమే పరిమిత చేయలని, ఎలాంటి గ్రేడింగ్ చేపట్టకుండా మార్కెట్ కమిషన్ 4 శాతానికి పరిమితమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో జీవన్ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.